టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు.. అప్పట్లో ఆయనకు అమ్మాయిల ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉండేది.. నిజం చెప్పాలి అంటే మన్మధుడిగా ఆయనకు ఇప్పటికీ అమ్మాయిల ఫాలోయింగ్ ఉంటుందటంలో సందేహం లేదు.. వాస్తవానికి అక్కినేని ఫ్యామిలీకి ఇండస్ట్రీలో చాలా మంచి గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఒక పెద్ద కుటుంబం గా వారు అందరితో కలిసి మెలిసిపోతారు. చాలా వరకు అక్కినేని ఫ్యామిలీ వివాదాలకు దూరంగానే ఉంటుంది. అయితే నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగార్జున అమ్మాయిల ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.
అందుకే ఆయనను అందరూ మన్మధుడు అని పిలుస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా నాగార్జున రెండు పెళ్లిళ్లు చేసుకుని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం తెలిసిందే. రామానాయుడు కూతురు లక్ష్మీతో పెళ్లి చేశారు అక్కినేని నాగేశ్వరరావు .. నాగచైతన్య పుట్టిన తర్వాత కొన్ని కారణాలవల్ల నాగార్జున ఆమెతో విడాకులు తీసుకున్నారు. అయితే ఆయన విడాకులకు అమల నే కారణమని అప్పట్లో అంతా కామెంట్లు కూడా చేశారు. ఎందుకంటే అదే సమయంలో దగ్గుబాటి లక్ష్మీతో విడిపోయిన తర్వాత నాగార్జున అమలను రెండో పెళ్లి చేసుకోవడమే ఈ వార్తలకు కారణం అయ్యింది.
నాగార్జున అమల కంటే ముందే మరో హీరోయిన్ ను ప్రేమించాడట. ఆమె ఎవరో కాదు రమ్యకృష్ణ.. ఆమెతో కలిసి చాలా సినిమాలు చేసిన నాగార్జున ఆమెతో ప్రేమలో పడ్డారట .అప్పట్లో వీరిద్దరి వ్యవహారంపై కూడా ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అప్పటికే రమ్యకృష్ణ, డైరెక్టర్ కృష్ణ వంశీని ఇష్టపడడుతోందని , ఆయనను పెళ్లి చేసుకోవాలని భావిస్తుందని తెలుసుకున్న నాగార్జున ఆమెకు తన ప్రేమ విషయం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయారట. ఆ తర్వాత అమలతో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. రమ్యకృష్ణ అనుకున్నట్టుగానే కృష్ణవంశీని వివాహం చేసుకుంది..