నాగార్జున, నాని ‘దేవ దాస్’ టీజర్

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ నిర్మాత సి అశ్విని దత్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ దేవా దాస్ ‘ టీజర్ ఈ రోజు అఫీషియల్ గా విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. నటుడు నాని కూడా తన అఫీషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా అభిమానులతో ఈ టీజర్ ని షేర్ చేసుకున్నారు. ఈ టీజర్ లో నాని, నాగార్జున మందు తాగుతూ దర్శనమిస్తారు. నాగార్జున నాని ని సోడా నా వాటర్ కావాలా అని అడుగుతుండగానే నాని గ్లాస్ లో ఉన్న మందుని తాగేసే సన్నివేశం అభిమానులని కడుపుబ్బా నవ్వించింది.

శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించగా, ప్రముఖ సంగీత దర్శకుడు మణి శర్మ ఈ చిత్రానికి స్వరాలూ సమకూర్చారు. రష్మిక మందాన, ఆకాంక్ష సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. ప్రపంచ వ్యాప్తంగా ‘ దేవా దాస్’ సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రం వైజయంతి ఫిలిమ్స్ బ్యానర్ లో నిర్మించ బడింది.

Share.