అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, ఆయన అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం థాంక్యూ. ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నాడు. ఈరోజు నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది.
ఈ సినిమాలో నాగచైతన్య ఎలా ఉండబోతున్నాయి అనే విషయం ఫస్ట్ లుక్ ను చూస్తే అర్థం అవుతోంది. గెడ్డం తో, కళ్ళజోడు పెట్టుకొని క్లాసులో కనిపిస్తున్నాడు నాగచైతన్య. ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అంతేకాక సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతుంది ఈ పోస్టర్. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్ అందిస్తున్నాడు. నాగ చైతన్య సరసన రాశిఖన్నా, అవికా గోర్ నటిస్తున్నారు.
ఏది ఏమైనా నాగచైతన్య ఈమధ్య వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇంకా అలాగే ఉదయాన్నే బంగార్రాజు సినిమా నుంచి కూడా ఒక భారీ అప్డేట్ రావడం విశేషం.