టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..పవన్ సినిమాలు వస్తున్నాయంటే ఫాన్స్ థియేటర్లో ముందు క్యూ కడతారు. ప్రస్తుతానికి పవన్ చేతిలో ఇప్పుడు 5 సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతానికి హర హర వీరమల్లు సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ కి సిద్ధమవుతోంది. అంతేకాకుండా హరి శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మరో సినిమాను ప్రారంభించారు. పవన్ కళ్యాణ్. ఇక సినిమాలను పక్కన పెట్టి మరోవైపు రాజకీయాలతో బిజీబిజీగా గడిపేస్తున్నాడు.
రీసెంట్గా పవన్ కళ్యాణ్ సహో డైరెక్టర్ సుజిత్ తో ఓ సినిమాను ప్రారంభించాడు. సినిమాల విషయం కాస్త పక్కన పెడితే ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ ఏపీలో జనసేన బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇక జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన సోదరుడు నాగబాబు కూడా కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగబాబు పవన్ కళ్యాణ్ గురించి సంచలన నిజాలు బయటపెట్టారు.
పవన్ కళ్యాణ్ కి ఏ ఆస్తి లేదని ఉన్న కారు ఇల్లు కూడా లోన్ లో తీసుకున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమాలు తీసి సంపాదించిన డబ్బునంత పార్టీ కోసం మరియు ప్రజల కోసం ఖర్చు చేస్తున్నారని నాగబాబు మాటల్లో తెలిపారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కి వ్యవసాయం అంటే మక్కువ ఉండటంతో శంకర్ పల్లి లో రూ .8లక్షలు పెట్టి ఎనిమిది ఎకరాల పొలాన్ని తీసుకున్నారు. ఆ భూమి ఒక్కటే పవన్ కళ్యాణ్ కి ఉన్న పెద్ద ఆస్తి నిజంగా అంతేనా పవన్ కళ్యాణ్ కి ఉన్న ఆస్తి అంటూ… ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.