టాలీవుడ్ లోకి మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చిన సంగతి తెలిసిందే.. అందులో చిరంజీవి సోదరుడిగా నాగబాబు ఎంట్రీ ఇచ్చాడు. అయితే హీరోగా ఆశించిన స్థాయిలో సక్సెస్ ని సాధించలేకపోయాడు. అందుకని నిర్మాతగా కూడా అవతరించాడు..కానీ అక్కడ కూడా తనకి సక్సెస్ కాకపోవటంతో దురదృష్టం వెంటే ఉందని చెప్ప వచ్చు..
అయితే ఆయన నిర్మించిన చిత్రంలలో బావగారు బాగున్నారా చిత్రం కాస్త ఆయనకు ఊరట కలిగించింది. ఆ తరువాత తీసిన సినిమాలన్నీ ఆయనకి నష్టాన్ని చేకూర్చాయి. ముఖ్యంగా మూడోతరం హీరోలతో తీసిన సినిమాలు కూడా నష్టాలే మిగిల్చాయి. ఇప్పటివరకు నాగబాబు కేవలం మెగా ఫ్యామిలీ హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చాడు.. కానీ అప్పట్లో ఆయన విక్టరీ వెంకటేష్ తో కూడా ఒక సినిమా చేయాలని చూశాడట.
అయితే ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఆ సినిమా ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన రుద్రవీణ ఈ సినిమాకి బాలచందర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ సాధించలేదు. కానీ మెగాస్టార్ కు మాత్రం క్రేజ్ పేరు ప్రఖ్యాతలను సంపాదించిపెట్టింది. అంతేకాకుండా ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అయితే ఈ సినిమాని విక్టరీ వెంకటేష్ తో చేయాలని అనుకున్నారట నాగబాబు. ఎందుకంటే ఇలాంటి చిత్రాలు ఆయనకైతే బాగా సెట్ అవుతాయని నాగబాబు చాలా బలంగా నమ్మాడట.
కానీ ఈ సినిమా చిరంజీవికి బాగా నచ్చిందట. ఈ సినిమా నేనే చేస్తాను, నువ్వు వెంకటేష్ తో కావాలంటే వేరే సినిమా చెయ్యి అని అన్నారట. ఒకవేళ ఈ సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా నా జీవితంలో బాలచందర్ దర్శకత్వంలో నటించాననే ఒక అనుభూతి నాకు దక్కుతుంది. ఆ అనుభూతి ముందు డబ్బులు ఎంత నీకు ఈ సినిమా వల్ల పొరపాటున నష్టం వస్తే ఆ నష్టాన్ని నేనే భరిస్తాను ఈ సినిమా నేనే చేస్తాను అని చెప్పాడట చిరంజీవి.. అలా రుద్రవీణ సినిమా చేశాడట.