త్వరలోనే మెగా హీరో పెళ్లి అంటూ నాగబాబు కామెంట్స్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలు సైతం ఇప్పుడు ఒక్కొక్కరు వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే హీరోలలో నాగశౌర్య ,కార్తికేయ ఇద్దరు కూడా ఒక ఇంటి వారయ్యారు. తాజాగా హీరో శర్వానంద్ కూడా నిశ్చితార్థం చేసుకున్నారు. మరొకవైపు ఏడాది ప్రభాస్ కూడా వివాహం చేసుకోబోతున్నారని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో మిగిలింది వరుణ్ తేజ్ ,సాయి ధరంతేజ్, అల్లు శిరీష్.

Varun Tej and Naga Babu surprises Pawan Kalyan

దీంతో వీరి పెళ్లి గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగా బ్రదర్ నాగబాబు తన కుమారుడు వివాహం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే వరుణ్ తేజ్ వివాహం జరగబోతుందని తన మ్యారేజ్ గురించి స్వయంగా వరుణ్ ప్రకటిస్తాడని తెలియజేశారు. నాగబాబు కానీ అమ్మాయి ఎవరనే విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు. పెళ్లికూతురుకు సంబంధించిన విషయాలను ఇప్పుడే చెప్పలేనని అన్ని విషయాలు వరుణ్ తేజ్ మాత్రమే వెల్లడిస్తారని తెలిపారు నాగబాబు.

ప్రస్తుతం వరుణ్ తేజ్ వేరే ఇంట్లో ఉంటున్నాడని మ్యారేజ్ తర్వాత కూడా తన భార్యతో కలిసి వేరే ఇంట్లో ఉండబోతున్నారని తెలియజేశారు నాగబాబు. వేరు వేరుగా ఉన్నప్పటికీ మానసికంగా కలిసే ఉంటామని చిరంజీవి పవన్ కళ్యాణ్ నేను కూడా వివాహం తర్వాతనే వేరువేరుగా ఉంటున్నామని అయితే మెయిన్ ఈవెంట్స్ ఫంక్షన్ సమయంలో మాత్రం అందరం కలిసి వాటిని జరుపుకుంటూ ఉంటామని తెలియజేశారు నాగబాబు. దీంతో ఎట్టకేలకు వరుణ్ తేజ్ వివాహం చేసుకోబోతున్నారనే విషయాన్ని నాగబాబు తెలియజేశారు.

Share.