ఎన్.టి.ఆర్ జయంతి సందర్భంగా రాఘవేంద్ర రావు కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ అందరికి సర్ ప్రైజ్ చేసింది. అందులో ముగ్గురు దర్శకులు.. ముగ్గురు హీరోయిన్స్.. ఒక హీరో ఉంటాడట. త్రీ డైరక్టర్స్ లో ఒకరుగా క్రిష్ ను సెలెక్ట్ చేశారట. మూడు కథలు ముగ్గురు దర్శకులు డైరెక్ట్ చేస్తారట. ఇక ఆ ముగ్గురు దర్శకులకు హీరో మాత్రం ఒకడే అతనే నాగ శౌర్య అని తెలుస్తుంది. శతచిత్ర దర్శకుడిగా అపార అనుభవం ఉన్న రాఘవేంద్ర రావు కొత్త ప్రయత్నం అని చెప్పారంటే కచ్చితంగా అందులో ఏదో విషయం ఉండే ఉంటుంది.
సినిమాలో నాగ శౌర్య సెలెక్ట్ అవడం కూడా అతని కెరియర్ కు చాలా మంచి ఊపునిస్తుందని చెప్పొచ్చు. టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా హిట్లు ఫ్లాపులతో సతమతమవుతున్న నాగ శౌర్యకు రాఘన్వేంద్ర రావు డైరక్షన్ లో సినిమా ఛాన్స్ రావడం.. అది కూడా ఎక్స్ పెరిమెంట్ గా చెప్పుకునే సినిమా చేయడం నిజంగా ఈ యువ హీరో లక్కీ అని చెప్పొచ్చు. ఓం నమో వెంకటేశాయ సినిమాతో డైరక్షన్ ఆపేసిన రాఘవేంద్ర రావు మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారు.
ఈమధ్య యువ దర్శకులు కూడా కొత్త కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. రాఘవేంద్ర రావు వాళ్లని మించే కొత్త కథ తీస్తాడా అని డిస్కషన్ నడుస్తుంది. కచ్చితంగా కథ కొత్తగా ఉంటే ఆయన అనుభవంతో దానికి మరింత క్రేజ్ వచ్చేలా చెయొచ్చు. ఎలాగు శిష్యుడు రాజమౌళి కూడా ఈ ప్రాజెక్ట్ పై ఓ కన్నేసే అవకాశం ఉంది. మరి దర్శకేంద్రుడు చేస్తున్న ఈ ప్రయత్నం ఎలా ఉంటుందో చూడాలి.