రెండో పెళ్లి చేసుకోబోతున్న నాగచైతన్య.. వధువు ఎవరంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎంత ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే నాగచైతన్య గురించి ఈ మధ్యనే ఒక భారీ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది..అదేంటంటే చైతన్య రెండో పెళ్లి విషయమే ..నాగచైతన్య రెండో పెళ్లి వార్తలు వినిపించినప్పటికీ అవి నిజం కాలేదు.. కానీ ఈసారి మాత్రం నాగచైతన్య పెళ్లి చేయాలని నాగార్జున గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నాగచైతన్య రెండో పెళ్లి పనులు స్టార్ట్ చేశారు అంటూ నాగార్జున సన్నిహితులు ఈ విషయాన్ని బయటకు చెప్పారట

Did Akkineni Naga Chaitanya buy a new home after his split from Samantha  Ruth Prabhu? | Telugu Movie News - Times of India

నాగచైతన్య రెండో పెళ్లి వార్తలు వినగానే అందరూ తక్కున శోభిత ధూళిపాల అని అనుకుంటున్నారు.. కానీ ఆ అమ్మడు కానేకాదు. ఎందుకంటే శోభిత ధూళిపాలిని నాగార్జున కోడలిగా చేసుకోకపోవటానికి ఒక కారణం ఉందట.. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుంచి సమంత ని తన కోడలిగా చేసుకొని చాలా ఇబ్బందులు పడ్డారు ..మరోసారి ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని కోడలిగా తెచ్చుకొని లేని పోనీ గొడవలు తెచ్చుకోవడం ఎందుకు అని నాగార్జున భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అందుకే ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాకుండా వేరే అమ్మాయిని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అంటూ తన సన్నిహితులతో చెప్పినట్లుగా ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.. నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాగ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఆమె ఒక బిజినెస్ మాన్ కుటుంబానికి చెందిన అమ్మాయి అంతేకాకుండా అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ నాగార్జున ఫ్యామిలీకి దగ్గర బంధువులు అవుతారట.అందుకోసమే ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తోంది.

ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ నాగచైతన్య పెళ్లి జరిగిపోవడం ఖాయం అంటూ సమాచారం వస్తోంది.అయితే ఈ రెండో పెళ్లి వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే కచ్చితంగా అక్కినేని ఫ్యామిలీ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సిందే..

Share.