అక్కినేని నాగచైతన్య, సమంత 2021 అక్టోబర్ నెలలో విడిపోతున్నట్లు ప్రకటించారు. వీరిద్దరు ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నప్పటికీ విడిపోవడంతో అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఎవరి జీవితంలో వారు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చైతన్య కెరియర్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య, శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి.. ఈ రూమర్స్ పై చైతన్యకాని శోభితకాని ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు. గత కొన్ని రోజులుగా చైతన్య ఇంట్లోనే శోభిత కూడా ఉంటోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ విషయంపై ఇప్పటివరకు పెద్దగా ఎవరు రెస్పాండ్ కాలేదు. ప్రస్తుతం ట్విట్టర్లో నాగచైతన్య ,శోభిత దూళిపాళ్ల డిన్నర్ కి వెళ్లిన ఒక ఫోటో వైరల్ గా మారుతోంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఫోటో ఇప్పటిది కాదు ఫిబ్రవరి నెలలో సురేంద్రమోహన్ నాగచైతన్యతో కలిసి ఉన్న ఒక ఫోటోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ ఫోటో ఫోర్ గ్రౌండ్లో నాగచైతన్య సేఫ్ సురేంద్రమోహన్ ఉండగా బ్యాక్ గ్రౌండ్లో కూర్చిలో కూర్చొని శోభిత కనిపించింది.
దీంతో అప్పటి ఫోటో ఇప్పటికీ వైరల్ గా మారుతూనే ఉంది. నిజానికి ఈ ఫోటో ఫిబ్రవరిలో దిగినది కాదు గత నవంబర్లో చైతన్య శోభిత లండన్ ట్రిప్ కి వెళ్లారు.. లండన్ లో జామావార్ హోటల్లో డిన్నర్ కి చైతన్య శోభిత కలిసి వెళ్లిన ఆ సమయంలో తీసిన ఫోటో అన్నట్లుగా సమాచారం. కానీ ఇప్పుడు ఎందుకు ఈ ఫోటో వైరల్ గా మారుతో తెలియాల్సి ఉంది. దీంతో వీరి రూమర్లు మరొకసారి వైరల్ గా మారుతోంది.