యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ సవ్యసాచి రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు చైతూ. అటు దర్శకుడు చందూ ముండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండనుందని చిత్ర టీజర్, ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు సినిమా అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు జనాలను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయని వారు అన్నారు. సినిమాను ఇంత అద్భుతంగా తెరకెక్కించిన చందూ ముండేటిని వారు అభినందించారు. అటు చైతూ యాక్టింగ్ కూడా ఈ సినిమాలో మరో లెవెల్‌లో ఉందని వారు కొనియాడారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సవ్యసాచి నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అనే ఆతృత అటు ప్రేక్షకులతో పాటు చిత్ర యూనిట్‌లోనూ నెలకొంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.