అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి జోడీగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయి ఉండాల్సింది. కానీ, కరోనా కారణంగా పోస్ట్2పోన్ అవుతూ వస్తోంది. కాగా, తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు.
ఈ సినిమాకు పవన్ సి.హెచ్ ఇచ్చిన మ్యూజిక్ ఇప్పటికే సూపర్ హిట్ అయింది. మలర్ బ్యూటి సాయిపల్లవి ఈ సినిమాలో డిఫరెంట్‌గా కనిపించబోతున్నదని తెలుస్తోంది. ఇక నాగచైతన్య ఈ సినిమా ద్వారా మరోసారి రొమాంటిక్ హీరో అని నిరూపించుకోబోతున్నారని అక్కినేని అభిమానులు అంటున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే నాగచైతన్య బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఫిల్మ్‌తో చైతన్య బాలీవుడ్ డెబ్యూ కాబోతున్నారు. దీంతో అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.