నాగ్ ను టార్గెట్ చేసిన సమంత..ఈ సారి ఏమి చేస్తుందో..?

Google+ Pinterest LinkedIn Tumblr +

అక్కినేని సమంత తాజాగా తెలుగు మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. సమంత.. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. చంద్రబోస్ రాసిన ” ఊ అంటావా మామ.. ఊ ఊ అంటావా..” అనే పాటలో ఆమె రెచ్చిపోయి మరీ హాట్ హాట్ గా కనిపిస్తూ.. అదిరిపోయే స్టెప్పు లతో అందరిని ఉర్రూతలూగించింది. మామూలుగా అయితే ఇది ఐటమ్ సాంగ్ అనుకోవాలి. అయితే అక్కడ స‌మంత లేకుండా ఉండి ఉంటే దీని గురించి ఇంత చర్చ వచ్చేది కాదు.

ముఖ్యంగా ఈ పాటలో స‌మంత ఉండడంతో పాటు పాటలో చాలా పదాలకు నానార్థాలు కూడా వెలికి తీస్తున్నారు మన నెటిజన్లు. ముఖ్యంగా మగ వారి నైజం ఇదే అంటూ మగవాళ్ళను టార్గెట్ చేసేలా ఆ పాటలో పదాలు ఉన్నాయి. ఇప్పటికే సమంత తన జీవితంలో రెండు సార్లు ఎదురు దెబ్బలు తింది. ఆ రెండు సార్లు కూడా మగవాళ్ళ చేతుల్లోనే ఎదురు దెబ్బ‌లు తిన్నది అన్న‌ది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంటే ఒకసారి సిద్దార్థ చేతిలో మోసపోగా..తాజాగా తన భర్త అక్కినేని నాగ చైతన్య చేతిలో మరోసారి మోసపోయింది.

ఇప్పుడు సమంత నటించిన ఐటెం సాంగ్ లో కూడా మగవాళ్ళను వారి బుద్ధుల‌ని టార్గెట్ చేస్తూ వచ్చేలా చాలా పదాలు ఉన్నాయి. ఇక సమంత తనకు నాగ చైతన్య తో పెళ్లి అయిన దగ్గరనుంచి నాగార్జునను మామ మామ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ వచ్చేది. సాధారణంగా ఎవరైనా తెలుగు జనాలు మామగారు లేదా మామయ్య అని పిలుస్తూ ఉంటారు. అయితే సమంత మాత్రం బహిరంగ వేదికల మీద మామ మామ అని నాగ్ ను పిలుచుకునేది.అయితే ఇప్పుడు ఐటెం సాంగ్ లో కూడా మామా అన్న‌ది కాస్త మావా అన్న‌ట్టుగా అయిపోయిందా ? అన్న సందేహాలు కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు.

ఏదేమైనా త‌న ఐటెం సాంగ్‌తో స‌మంత నాగ్ కే ప‌రోక్షంగా ప‌లు ప్ర‌శ్న‌లు సంధించింద‌ని కొంద‌రు అంటున్నారు. అయితే ఇదంతా కావాల‌ని చేశారా ? లేదా యాదృఛికంగా జ‌రిగిందా ? అనే విషయం తెలియాలంటే..కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Share.