టాలీవుడ్ లో క్రేజీ మల్టీస్టారర్స్ హవా మొదలైంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత మల్టీస్టారర్ సినిమాల మీద మోజు పడ్డారు స్టార్ హీరోలు. ప్రస్తుతం సెట్స్ మీద నాగార్జున నాని మల్టీస్టారర్ మూవీ దేవదాస్ క్రేజీ ప్రాజెక్ట్ గా మారింది. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను అశ్వనిదత్ నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో నాగార్జున డాన్ గా.. నాని డాక్టర్ పాత్రలో నటిస్తున్నారట. సినిమాలో నాగార్జున పాత్ర విశాదాంతం అవుతుందని తెలుస్తుంది. స్టార్ హీరో సినిమా అంటే కొన్ని అంచనాలు ఉంటాయి. మరి అలాంటి సినిమా అది కూడా మల్టీస్టారర్ సినిమాలో ఒక పాత్ర మధ్యలో ఆగిపోవడం ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
ఆకాంక్ష సింగ్, రష్మిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి.