బ్రతికా చాలు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్న నభా నటేష్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ హీరోయిన్ నభా నటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉండగా యాక్సిడెంట్ కి గురయ్యానని స్వయంగా వెల్లడించింది. యాక్సిడెంట్ కి గురైన తర్వాత ఈమె ఫ్యూచర్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఎమోషనల్ కామెంట్లు చేయడం గమనార్హం .. యాక్సిడెంట్ కారణంగా కొన్ని ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్లను వదులుకోవాల్సి వచ్చింది అంటూ ఆమె బాధపడ్డారు

Nabha Natesh Wiki, Bio, Age, Biography, Husband, Family, Height, Networth

అయితే ఆ విషయంలో తనకు బాధ లేదని, యాక్సిడెంట్ తర్వాత బ్రతికి ఉన్నందుకు సంతోషంగా ఉంది అంటూ తెలిపింది. గాయాల నుంచి కోలుకోవడానికి దాదాపు ఒక సంవత్సరం సమయం పట్టిందని.. ఇప్పుడు దృఢంగా తయారయ్యాను అంటూ నభా నటేష్ వెల్లడించారు.. అయితే తనకు యాక్సిడెంట్ ఎప్పుడు జరిగిందనే విషయాన్ని చెప్పడం ఇష్టం లేదు అని ఆ విషయాలన్నీ గోప్యంగానే ఉంచుతానని తెలిపింది.. తన భుజం వెనుక పలుచోట్ల విరిగిందని బెంగళూరులో తనకు ఆపరేషన్ చేశారని కూడా చెబుతోంది.

పాత్రల ఎంపిక విషయంలో చాలా లోతుగా ఆలోచిస్తానని, ఒక నటిగా, హీరోయిన్గా చూసుకోవాలని అనుకుంటున్నా అంటూ చెప్పింది.ఈమధ్య కాలంలో చాలా కథలు విన్నాను త్వరలోనే కొత్త ప్రాజెక్టులతో మీ ముందుకు వస్తాను అంటూ నభా నటేష్ వెల్లడించారు. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న ఈమె యాక్సిడెంట్ తర్వాత అలా జరగడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ ఎమోషనల్ అయింది. ఇకనైనా కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకొని సక్సెస్ అవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మ త్వరగా రికవరీ అయ్యి సినిమాలలోకి రావాలని అభిమానులు పూర్తిస్థాయిలో ఆకాంక్షిస్తున్నారు. మరి త్వరలోనే ప్రేక్షకులను ఎలాంటి కథతో అలరిస్తుందో చూడాలి.

Share.