వెంకట్ ప్రభు డైరెక్షన్లో హీరోగా శింబు నటిస్తున్న తాజా చిత్రం లూప్. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో శింబు ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆశక్తికరమైన వాక్యాలను చేశాడు. సినిమాకి ముందు నా కెరియర్ చాలా దీన పరిస్థితుల్లో ఉండేది. అందుకే ఈ సినిమా కోసం నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. నన్ను నేను మార్చుకోవడానికి ఈ సినిమా కోసం ఏకంగా 27 కేజీలు బరువు తగ్గానని చెప్పుకొచ్చాడు.
ఆహార అలవాట్లు దగ్గర నుండి మద్యపానం వరకు అన్ని విషయాల్లో చాలా నిబంధనలను పాటించాను అందుకే ఈ సినిమాలో నేను సరి కొత్తగా కనిపిస్తాను.. అన్నట్లుగా తెలియజేశారు. ఇకపై తన ప్రతి సినిమాని కూడా తెలుగు లో కూడా విడుదల చేస్తానని చెప్పుకొచ్చాడు. తెలుగులో కుదిరితే స్ట్రైట్ గా ఒక సినిమా చేయాలనుకుంటున్నాను దిలూప్ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నందుకు అల్లు అరవింద్ గారికి, బన్నీ వాసు కృతజ్ఞతలు తెలియజేశాడు హీరో శింబు. అయితే ఈ సినిమా సక్సెస్ కావాలని మనం కూడా కోరుకుంటున్నాం.