యంగ్ హీరో రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ” హలో గురు ప్రేమ కోసమే ” చిత్రంలోని మై వరల్డ్ ఈజ్ ఫ్లైయింగ్ హై అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేసారు చిత్ర బృందం. సాంగ్ ఆద్యంతం సరదాగా సాగుతూ చక్కటి లిరిక్స్ తో ప్రేక్షకులని అలరించింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలూ అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినీ అభిమానులని ఆకట్టుకోగా, ఈ రోజు విడుదల చేసిన లిరికల్ సాంగ్ కూడా హిట్ కావటంతో ఈ సినిమా పై టాలీవుడ్ లో అంచనాలు పెరిగాయ్ అని చెప్పవచ్చు.
ప్రస్తుతం చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు దర్శకుడు త్రినాథ రావు నక్కిన. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ” హలో గురు ప్రేమ కోసమే ” ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 18 న విడుదల కానుంది.