బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్.. ఎవరంటే?

Google+ Pinterest LinkedIn Tumblr +

మ్యూజిక్ డైరెక్టర్ అమ్రేష్ మొదట బాలనటుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత సంగీతంపై ఆసక్తి ఉండడంతో దానిపై దృష్టి సారించారు. అలా చిన్న చిన్నగా మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో నటిగా దర్శకురాలిగా నిర్మాతగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న సీనియర్ నటి జయచిత్ర కుమారుడే ఈ అమ్రేష్ అన్న విషయం అందరికి తెలిసిందే. మొదటి నటుడిగా కెరిర్ ను ప్రారంభించి ఆ తర్వాత సంగీత దర్శకుడిగా స్థిరపడిపోయారు.

మొట్టశివ కెట్టశివ,భాస్కర్,ఒరు రాస్కెల్, చార్టు చాప్లిన్ 2, శత్రు, గర్జన లాంటి సినిమాలకు సంగీతం అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే సంగీత దర్శకుడు అమ్రేష్ బాలీవుడ్ కి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మల్లికా శెరావత్ కథానాయికగా నటిస్తున్న నాగమతి చిత్రానికి అమ్రేష్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. పాటల రికార్డింగ్ కార్యక్రమాన్ని అమ్రేష్ ముంబైలో రూపొందిస్తున్నారు.

Share.