సర్కార్ టీమ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్ మురుగదాస్

Google+ Pinterest LinkedIn Tumblr +

మురుగదాస్ డైరక్షన్ లో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా వస్తున్న సినిమా సర్కార్. కోలీవుడ్ లోనే కాదు సౌత్ లో ఈ ఇయర్ రాబోతున్న ప్రతిష్టాత్మక సినిమాల్లో ఇది ఒకటి. అయితే ఈ సినిమా టీజర్ ఈమధ్యనే రిలీజై సంచలనం సృష్టిస్తుండగా.. సినిమాకు సంబందించి ఎలాంటి ఇంటర్వ్యూస్ ఇవ్వొద్దని మురుగదాస్ తన ట్విట్టర్ లో మెసేజ్ పెట్టారు.

సర్కార్ సినిమాలో నటించిన జూనియర్ ఆర్టిస్టులు కొంతమంది ఇంటర్వ్యూస్ ఇస్తూ సర్కార్ సినిమా విషయాలను వెళ్లడిస్తున్నారు. అయితే దీనిపై మురుగదాస్ చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తుంది. అందుకే చిత్రయూనిట్ కాస్ట్ అండ్ క్రూ ఎవరు సినిమాకు సంబందించి ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వొద్దని. తన పర్మిషన్ లేనిది అసలు ఇంటర్వ్యూస్ ఇవ్వొద్దని చెప్పాడట.

అయితే సినిమా లీక్ అవడం ఇష్టం లేక ఇలా అంటున్నాడా లేక ఎవరి మీదైనా కోపంతో మురుగదాస్ ఇలా అన్నాడా అన్నది తెలియాల్సి ఉంది. కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 6న రిలీజ్ కానుంది.

Share.