‘సర్కర్’కు రాజకీయ శిక్ష … మురుగుదాస్ అరెస్ట్ అవుతాడా ..?

Google+ Pinterest LinkedIn Tumblr +

కోలీవుడ్ స్టార్ డైరక్టర్ మురుగదాస్ ఇంట పోలీసుల బీభత్సం అంతటా హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల రిలీజైన విజయ్ సర్కార్ సినిమాలో అన్నాడిఎంకే పార్టీకి వ్యతిరేకంగా సన్నివేశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సినిమా దర్శకుడు మురుగదాస్ ఇంటికి రావడం జరిగిందట.

అయితే అప్పటికే దర్శక నిర్మాతలు సినిమాలోని అభ్యంతరకరమైన సీన్స్ కట్ చేశారట. దానితో మురుగదాస్ ను అరెస్ట్ చేయకుండా వదిలేశారట. ఓ పక్క కోలీవుడ్ లో సర్కార్ సినిమా మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నా వసూళ్ల బీభత్సం సృష్టిస్తుంది. కోలీవుడ్ లో కలకలం రేపుతున్న ఈ సర్కార్ సినిమా అనుకున్నట్టుగానే సంచలనంగా మారింది. ఈ సినిమా విజయ్ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేస్తుందని అతని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.

Share.