మృణాల్ ఠాకూర్ ఈమె చిన్నచిన్న యాడ్స్ చేస్తు బాలీవుడ్ లో ఉండేది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించింది. తెలుగులో సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యింది. ఈమె క్లాసికల్ డాన్సర్ కూడా.. సీతారామం సినిమాతో ఎనలేని పాపులారిటీని సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. ఆ సినిమాతోనే అగ్ర హీరోలతో నటించే అవకాశాన్ని కూడా అందుకుంది. అయితే ఇప్పుడు నేచురల్ స్టార్ నానితో ఒక సినిమా చేయబోతోంది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో కూడా ఒక సినిమా కమిట్ అయిందని తెలుస్తోంది. అయితే ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో గట్టి ప్రయత్నాలు చేస్తోందని అర్థమవుతోంది.
అలాగే సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గానే ఉంటుంది. తన జీవితంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టింది. తనకు చిన్నతనం నుంచే క్రికెట్ బ్యాట్మింటన్ అంటే చాలా ఇష్టమని ..ముఖ్యంగా తనకు క్రికెట్ ఆడడం అంటే ఇష్టం తన తమ్ముడి వల్ల ఇలా నాకు ఈ ఆట మీద ఇష్టం కలిగిందని తెలిపింది. అంతేకాకుండా ఐదు సంవత్సరాల క్రితమే బ్లూ జెర్సీ వేసుకొని స్టేడియంలో ఎంజాయ్ చేశాను. ఆ తరువాత జెర్సీ సినిమాలో నటించే అవకాశం కూడా వచ్చింది.
అంతేకాకుండా తనకి క్రికెట్ పరంగా విరాట్ కోహ్లీ అలాగే హీరోలలో షాహిద్ కపూర్ అంటే చాలా ఇష్టమని తెలియజేసింది. అంతేకాకుండా నేను ఇండస్ట్రీలోకి రాకముందు ఆయన ఫోటోలు ఎక్కువగా కట్ చేసుకుని పుస్తకంలో దాచుకునే దాన్ని మా పేరెంట్స్ ఎంత తిట్టినా కూడా అలాగే కట్ చేసుకుంటూ పుస్తకాల్లో దాచుకునే దాన్ని అంటూ మృణాల్ ఠాకూర్ తెలిపింది.అలాంటి షాహిద్ కపూర్ సినిమాలో నాకు నటించే అవకాశము కలిగింది. దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను అలాగే నా వృత్తిని అర్థం చేసుకునే వాడిని నేను పెళ్లి చేసుకుంటానని కూడా ఈ సందర్భంలో తెలియజేసింది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.