త్రిష ఈజ్ బ్యాక్… ‘మోహిని’ ట్రైలర్

Google+ Pinterest LinkedIn Tumblr +

త్రిష తెలుగునాట అగ్ర కథానాయకిగా కొనసాగిన తార, మెల్లిగా తన హవా తగ్గుతూ వచ్చింది. అయితే ఇంకా తెలుగు. తమిళ్ సినిమాల్లో అవకాశాలు వస్తూనే ఉన్నాయ్. త్రిష గత చిత్రం ‘నాయకి’ ఆమెకి కావాల్సిన హిట్ ని ఇవ్వలేదనే చెప్పాలి. ఇప్పుడు అదే హారర్ కథాంశం తో ‘మోహిని’ అనే చిత్రం లో నటిస్తుంది త్రిష.

సినిమా కథల్లో ఎప్పటికి మారని జానర్ ఏదైనా ఉందంటే అది హారర్ కథలే, ఇక ఇదే ఫార్ములా ని నమ్ముకుని హిట్ కొట్టాలని చూస్తుంది త్రిష. అందుబాటులో ఉన్న కొత్త టెక్నాలజీ వలన ప్రేక్షకులని మరింత భయపెట్టే అవకాశం ఎలాగో ఉంది. ఇక తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది. పే మాదేష్ ఈ చిత్రానికి దర్శకుడిగా పని చేసారు.

Share.