ఈ రోజు ట్విట్టర్ వేదికగా నటుడు మోహన్ బాబు కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు. 1997 లో తన సినిమా ‘శ్రీ రాములయ్య’ షూటింగ్ రామోజీ ఫిలిం స్టూడియో లో జరుగుతున్నా సమయంలో అదే టైం లో పక్కనే ఉన్న సెట్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, గోవిందా కూడా అక్కడే ఉన్నారట. వారు కూడా మోహన్ బాబు పక్కే సెట్లో ఉన్నారని తెలుసుకుని అతన్ని కలవాలని వస్తుండగా నేనే వారి వద్దకు వెళ్లి కలిశానని ట్విట్టర్ ద్వారా చెప్పారు మోహన్ బాబు. ఈ సందర్భంలో సెట్లో దిగిన ఒక ఫోటోని కూడా షేర్ చేసారు, అందులో అమితాబ్, గోవిందా తో పాటు మోహన్ బాబు కూడా దర్శనమిచ్చారు.
ఇక ఈ ఫోటోని పోస్ట్ చేస్తూ మోహన్ బాబు ఒక ఆసక్తికర విషయం వెల్లడించారు అదేంటంటే ‘ ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ వేడుక లో అనుకోని విధంగా బాంబ్ బ్లాస్ట్ జరిగిందని, అయితే అందరం సురక్షితంగా బయట పడ్డామని తెలిపారు. ఇదే విషయాన్నీ అమితాబ్, గోవింద లకి కూడా వివరిస్తున్న సమయంలోనిదే ఈ ఫోటో అని అయన తెలియ చేసారు.అయితే ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని ఇప్పుడు మోహన్ బాబు ప్రస్తావించటం పై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు. మోహన్ బాబు మళ్లీ తెర పైకి తీసుకువచ్చినా ఈ ఉదంతం ఎటువంటి రాజకీయ చర్చలకు దారి తీస్తుందో వేచి చూడాలి.
1997 లో 'శ్రీ రాములయ్య' షూటింగ్ రామోజీఫిల్మ్ సిటీలో జరుగుతుండగా.. పక్కసెట్లో ఉన్న అమితాబ్, గోవిందలు నన్ను కలవాలని వస్తున్నారని తెలిసి.. నేనే వారివద్దకు వెళ్ళాను. సినిమా ప్రారంభోత్సవ సమయంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ గురించి వివరిస్తున్న సందర్భంలోనిది ఈ స్టిల్. #SriRamulayya pic.twitter.com/jo4cuMDpO9
— Mohan Babu M (@themohanbabu) July 24, 2018