కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకవైపు సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన ఇప్పుడు విద్యాసంస్థలను నిర్వహించడంలో బిజీగా మారిపోయి సినిమాలను అడపా దడపా మాత్రమే సినిమాలు చేస్తూ విద్యానికేతన్ విద్యాసంస్థల నిర్వహణలో బిజీగా ఉన్నారు. అంతే కాదు రాజకీయంగా కూడా అప్పుడప్పుడు ఈయన చేసే వ్యాఖ్యలు ఒక్కొక్కసారి పొలిటికల్ వారు సృష్టించబోతున్నాయని చెప్పాలి.
మోహన్ బాబు సాధారణంగా సాయిబాబా భక్తుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా ఆయన శిరిడి సాయిబాబాను చాలా ప్రత్యేకంగా పూజిస్తారు. అంతేకాదు షిరిడీని తలపించే విధంగా ఆయన తిరుపతిలో సాయిబాబా మందిరాన్ని కూడా నిర్మించిన విషయం తెలిసిందే. అంతలా ఆయన సాయిబాబా భక్తుడిగా నిరూపించుకున్నారు. ఇకపోతే ఏ విషయంపై అయినా సరే ముక్కుసూటితనంతో మాట్లాడే మోహన్ బాబు రాజకీయాలలో కూడా రాణించి మంచి పేరు దక్కించుకున్నారు.
2019 ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీకి మద్దతు తెలిపిన ఈయన 2019 ఎన్నికల తర్వాత కొద్దిగా రాజకీయాలకు దూరం అయ్యారు. ఇదే సమయంలో బిజెపి పార్టీకి కొద్దిగా దగ్గరవుతూ వైసిపి పై కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఈ క్రమంలోనే ఇటీవల గురు పౌర్ణమి సందర్భంగా తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ అనే తన విద్యాసంస్థల వద్ద షిరిడి సాయిబాబా మందిరాన్ని నిర్మించిన సందర్భంగా ఆ మందిరంలో మొదటి గురు పౌర్ణమి వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు.
దేశమంతా సురక్షంగా ఉండాలని కోరుకున్న ఆయన తిరుపతి చుట్టుపక్కల మొత్తం దైవ నామస్మరణతో మారుమ్రోగుతోందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తాను నిర్మించిన షిరిడి సాయిబాబా మందిరం గురించి కూడా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు సాయినాధుడే ఇక్కడికి వచ్చారని వ్యాఖ్యానించినాయన తిరుపతి జిల్లాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే దేశం సంతోషంగా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటున్నట్లు మీడియాతో వెల్లడించారు.