చిరంజీవితో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన మోహన్ బాబు..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న హీరో మోహన్ బాబు. ఈయన ఎన్నో చిత్రాలలో హీరోగా విలన్ గా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్నాడు. టాలీవుడ్ నుంచి రాజకీయ ప్రముఖులు మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడ మోహన్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Chiranjeevi, Mohan Babu on a weekend getaway to Sikkim. See pic - Hindustan  Times

యాంకర్ మోహన్ బాబును ఇలా ప్రశ్నించింది. మోహన్ బాబు గారు చిరంజీవి వజ్రోత్సవాలలో జరిగిన వివాదం గురించి మీరు ఏమంటారు.. దానికి మోహన్ బాబు మాట్లాడుతూ సోషల్ మీడియాలో చాలా వస్తుంటాయని వాటిలో నిజాలు ఏంటో అబద్ధాలు ఏంటో ఎవరికి తెలియదని అయితే జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడు ఎందుకు ప్రశ్నించారు. అయితే చిరంజీవి నేను ఎప్పుడూ మంచి స్నేహితులం ఇప్పుడు కూడా మేము సంతోషంగా ఉన్నామని… కొన్నిసార్లు కుటుంబంలో గొడవలు వస్తూ ఉంటాయి అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉంటాయి. అలాగే మా మధ్య కూడా చిన్న చిన్న మాటలు దొర్లుతుంటాయని అన్నారు.

ఇక అప్పటి విషయాలు ఎందుకు ఇప్పుడు వేరే మాట్లాడుకుందాం అవన్నీ పక్కకు పెట్టండి అని కామెంట్స్ చేశారు. అదేవిధంగా మా ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలపై కూడా మోహన్ బాబు స్పందించారు. మా ఎలక్షన్స్ ఒక చరిత్ర అని అన్నారు అలా ఎందుకు జరిగిందా అని తాను ఆశ్చర్యపోతుంటానని అన్నారు. అయితే నా కొడుకు విష్ణు విజయం సాధించాడని.. ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చాడో అవన్నీ నెరవేర్చాడని మోహన్ బాబు అన్నారు. ఒక్క బిల్డింగ్ విషయం తప్ప అన్ని పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఊరికే అందరిపై కామెంట్స్ లు జోక్స్ లు చేస్తారని అవి ఎవరు చూడరని అన్నారు. అలాంటి పరిస్థితి చిరంజీవికి కానీ నాకు కానీ రాకూడదని చెప్పారు.

Share.