టాలీవుడ్ ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈయన మరణవార్తతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా మూగబోయింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. అతని మరణ వార్త విన్న తర్వాత ఎంతోమంది ప్రముఖులు అతనికి నివాళులు అర్పించారు.
కానీ సిరివెన్నెల అంత్యక్రియలకు తెలుగు సినీ పరిశ్రమ మొత్తం తరలి వచ్చి అతనికి వీడ్కోలు చెప్పారు. బాలకృష్ణ, నాగార్జున ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలు అందరూ ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు. కానీ ఈ కార్యక్రమంలో మంచు ఫ్యామిలీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. సినీ ఇండస్ట్రీలో ఎవరికీ ఎలాంటి కష్టం వచ్చినా, ఎవరు మరణించిన ముందుగా అక్కడికి చేరుకునేది మంచు కుటుంబమే. అలాంటిది సిరివెన్నెల మరణిస్తే మంచు కుటుంబం అక్కడ కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకు రాలేదు అన్న దానిపై ఒక ఈవెంట్ లో పాల్గొన్న మోహన్ బాబు వివరణ ఇచ్చాడు. ఇటీవలే మోహన్ బాబు ఇంట్లో తన సొంత తమ్ముడు మృతి చెందిన విషయం తెలిసిందే. సిరివెన్నెల చనిపోయిన రోజు మోహన్ బాబు నా తమ్ముడి పెద్ద కర్మ వల్ల సిరివెన్నెల అంత్యక్రియలకు రాలేకపోయాను అని చెప్పాడు.