మనోజ్ రెండో పెళ్లి మోహన్ బాబుకి ఇష్టం లేదా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ రోజున మంచు మనోజ్ రెండో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ పెళ్లి గ్రాండ్గా జరగబోతున్నట్లు సమాచారం. గడిచిన రెండు రోజుల క్రితం నుంచి అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్నాయి. మంచు మనోజ్, భూమా మౌనికల పెళ్లి జరగనుండగా ఈ పెళ్లి కోసం భారీ స్థాయిలో ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఎందుకు మోహన్ బాబు లేకుండా మంచు మనోజ్ రెండో పెళ్లి జరగబోతున్నట్లు తెలుస్తోంది.

Manchu Manoj - Mohan Babu: మనోజ్ పెళ్లి మోహన్‌బాబుకి ఇష్టం లేదట.. అసలు ఆయన  రారట.. - Sootiga

మంచు మనోజ్ చాలా సంవత్సరాల క్రితమే తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా భూమ మౌనికతో, మనోజ్ ప్రేమలో పడినట్లుగా వార్తలు వినిపించాయి. భూమా మౌనిక కూడా తన మొదటి భర్తకు విడాకులు ఇవ్వడం జరిగింది. అయితే విడాకులు తీసుకున్న అమ్మాయిని మనోజ్ పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకి ఏమాత్రం ఇష్టం లేదని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు భూమా మౌనిక టిడిపికి చెందిన వ్యక్తి కూతురు కావడంతో మోహన్ బాబు ఈ పెళ్లి ఇష్టం లేదన్నట్లుగా తెలుస్తోంది.

మోహన్ బాబు ఇప్పటికే ఆస్తులను సైతం కొడుకులకు పంచి చేశారని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవాలు తెలియాల్సి ఉంది. కానీ మంచు లక్ష్మి ఇంటి దగ్గర ఈ పెళ్లి జరగనుండగా ఈ పెళ్లికి మంచు లక్ష్మి సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది .ఇక మనోజ్ బంధుమిత్రులు స్నేహితులు ఈ పెళ్లి వేడుకకు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం మోహన్ బాబు తిరుపతిలో ఉన్నట్లు సమాచారం. మరి వివాహం తర్వాత మంచు మనోజ్ సినిమాల పైన ఎక్కువగా ఫోకస్ పెడతారేమో చూడాలి మరి.

Share.