ఒకప్పుడు హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్ కూడా ఒకరు.ఈ అమ్మడు అగ్ర హీరోలైన ప్రభాస్, రవితేజ, వెంకటేష్ ఇలా పలు సినిమాలలో నటించింది. అయితే మొట్టమొదటిగా 2010లో రానా దగ్గుపాటి లీడర్ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తరువాత నాగవల్లి, మిర్చి, మిరపకాయ్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ముఖ్యంగా ప్రభాస్ తో నటించిన మిర్చి సినిమాలో సెకండ్ హీరోయిన్ అయినా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో రీచాకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు రావడం జరిగింది. అలాగే స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోతుందని కూడా భావించారు.
కానీ రీచా ఉన్నట్టుండి పెళ్లి చేసుకొని యునైటెడ్ వెళ్ళిపోతుందని అసలు ఊహించలేదు. ప్రభాస్ తో మిర్చి సినిమా తీసిన తర్వాత నాగార్జునతో భాయ్ అనే సినిమాలో నటించింది. అయితే అదే తన ఆఖరి సినిమా అవుతుందని అసలు అనుకోలేదు. ఆ తర్వాత యునైటెడ్ వెళ్లి అక్కడి తన చిన్ననాటి స్నేహితుడు జో లంగెళ్ళ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని వారిద్దరి దంపతులకు గుర్తుగా ఒక కొడుకు కూడా పుట్టాడు. ప్రస్తుతం రీచా తన వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటూ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఉన్నట్టుండి రీచా సినిమాలకు పుల్ స్టాప్ పెట్టటానికి కారణం చదువు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ చదువు కాదట. టాలీవుడ్ కు చెందిన ఒక స్టార్ హీరో తనని మోసం చేశాడని టాక్ వినిపిస్తోంది .అయితే రీచా ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడిందట.ఆ స్టార్ హీరో కూడా రీచా ప్రేమలో పడ్డాడట. ఇద్దరూ బాగా దగ్గరయ్యారట .పెళ్లి చేసుకోమంటే మాత్రం నో చొప్పాడట.దాంతో రీచాకు నన్ను ఇతడు మోసం చేశాడని అర్థం చేసుకొని సినిమాలకు దూరమై విదేశాలకు వెళ్లిపోయిందని సమాచారం. మరి ముద్దుగా మన మోసం చేసిన ఆ హీరో ఎవరో అంటూ అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు.