మిక్కీ జే మేయర్ పై రామజోగయ్య శాస్త్రి కామెంట్స్ వైరల్ …!

Google+ Pinterest LinkedIn Tumblr +

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందచేసారు.తాజాగా ఈ చిత్రం నుండి సిరివెన్నెల లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సినిమాలోని ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన చివరి పాటఅవ్వడం విశేషం అనే చెప్పాలి. కాగా ఈ పాటను సిరివెన్నెల సీతారామస్వామికి అంకితం చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించినది. ఈ క్రమంలో రామ జోగయ్య శాస్త్రి గారి ఈ పాటపై స్పందిస్తూ, సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ మరియు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ లు ఆశీర్వదించబడ్డారు అంటూ చెప్పుకొచ్చారు. అందుకు దర్శకులు స్పందిస్తూ, నమస్కారం పెట్టడం జరిగింది. అలాగే ఈ చిత్రం డిసెంబర్ 24 వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది.

Share.