టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రతి ఒక్కరికి సుపరిచితమే..ఈయన ఒకప్పుడు తెలియకపోవచ్చు కానీ ఎఫ్-2, ఎఫ్ -3 సినిమాతో ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఆ తరువాత మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా ప్రేక్షకుల్లో ఒక ముద్రను వేసుకున్నాడు. త్వరలోనే బాలయ్యతో భగవంత్ కేసరి సినిమా కూడా రాబోతోంది. సినిమా సంగతులు కాస్త పక్కన పెడితే ఒకప్పుడు అనిల్ రావిపూడి ఒక యంగ్ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడనే వార్తలు వినిపించాయి.
అంతేకాకుండా పెళ్లయిన తర్వాత ఆ హీరోయిన్ తోనే అఫైర్ కొనసాగిస్తున్నట్లు గా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అనిల్ రావిపూడి అసలు ఎవరితో ఎఫైర్ పెట్టుకున్నాడు అనే విషయంలోకి వెళితే..ఆ హీరోయిన్ ఎవరో కాదు హీరోయిన్ మెహ్రీన్ అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ అమ్మడు మొట్టమొదటిగా కృష్ణ గాడి వీర ప్రేమ కథ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత రాజా ది గ్రేట్ చిత్రం షూటింగ్ సమయంలో అనిల్ రావిపూడి మెహ్రీన్ కి పరిచయం ఏర్పడటంతో వీరిద్దరూ క్లోజ్ గా ఉండటం మొదలుపెట్టారట.
ఆ తరువాత గోపీచంద్ తో వచ్చిన సినిమా అలాగే చాలా సినిమాలను ఆమె కోసమే రికమెండ్ చేసి అనిల్ రావిపూడి ఇప్పించారట.అలాగే ఈయన తీసిన ఎఫ్-2, ఎఫ్-3 సినిమాలలో కూడా ఆమె కోసమే ఒక పాత్రను క్రియేట్ చేసి రాశాడట. దీంతో టాలీవుడ్ లో వీరి వ్యవహారం కోడై కోసింది. దాంతో అనిల్ రావిపూడి భార్యకు ఈ విషయం తెలిసి మెహ్రీన్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిందట.
ఇక అప్పటి నుంచి మెహరీన్, అనిల్ రావిపూడి కి దూరంగా ఉండటం మొదలు పెట్టిందట. అంతేకాకుండా మెహరీన్ వివాహం పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోవడానికి కారణం ఈ ఎఫైర్ అంటూ ఇప్పటికీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.