ఆ సినిమాలో నాగార్జున సరసన మెరవనున్న మెహరీన్?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు బుల్లితెర పై ప్రసారమయ్యే బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ వయసులో కూడా తన ఇద్దరు హీరోలకు పోటీగా నిలుస్తూ దూసుకు పోతున్నారు. ఇది ఇలా ఉంటే నాగార్జునకు జోడీగా మెహరీన్ నటించినుందా? అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ది గోస్ట్.

ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో ఫస్ట్ హీరోయిన్ గా కాజల్ ను ఎంపిక చేయగా ఆమె వ్యక్తిగత కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకుంది. అనంతరం అమలాపాల్ ను హీరోయిన్ గా అనుకున్నప్పటికీ, ఫైనల్ గా మెహరీన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున రా ఏజెంట్ గా కనిపించనున్నారు.

Share.