మెగాస్టార్ తో బోయపాటి శ్రీను సినిమా నిజమేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో మాస్ సినిమాలకు పెట్టింది పేరు డైరెక్టర్ బోయపాటి శ్రీను. అయితే ఇటీవల కాలంలో రామ్ చరణ్ తో వినయ విధేయత రామా అనే సినిమాని తెరకెక్కించ గా అది డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఆ సినిమా రిజల్ట్ తర్వాత బోయపాటి శ్రీను తో సినిమా చేయాలంటే చాలా మంది హీరోలు భయపడ్డారు.అయితే అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.

అఖండ సినిమాకు బోయపాటి టేకింగ్, బాలయ్య యాక్షన్ తోడవడంతో ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా బోయపాటి శ్రీను ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇక అఖండ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో.. బోయపాటి తర్వాత సినిమా ఎలా ఉండబోతోందొ అని అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బోయపాటి నెక్స్ట్ చేయబోయే సినిమా గురించి చిరంజీవితో ఉండబోతోందనే వార్త తెలుస్తోంది. ప్రస్తుతం ఆ సినిమా పనులకు సంబంధించి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటికి సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన వెలువడిన ఉన్నట్లు సమాచారం.

Share.