శంకర్.. చిరంజీవి.. అల్లు అరవింద్.. అదిరిపోయే కాంబో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఖైది నంబర్ 150తో పదేళ్ల తర్వాత కూడా తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసిన చిరంజీవి వరుస సినిమాలు చేస్తున్నాడు. 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసిం హా రెడ్డి జీవిత చరిత్రతో సైరా సినిమా వస్తుంది. ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. సైరా తర్వాత కొరటాల శివతో చిరు సినిమా ఉంటునని తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక ఈ రెండిటి తర్వాత చిరంజీవి తమిళ క్రేజీ డైరక్టర్ శంకర్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. శంకర్, చిరంజీవి అదిరిపోయే కాంబినేషన్ ఎన్నాళ్ల నుండో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా అంటే తప్పకుండా మెగా ఫ్యాన్స్ కు పండుగ అన్నట్టే. అయితే 2020 మధ్యలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంటుందట.

ప్రస్తుతం శంకర్ భారతీయుడు-2 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కూడా చాలా లేట్ అవుతూ వస్తుంది. కమల్ రాజకీయాల్లో ఉండటం వల్ల ఆ సినిమా షూటింగ్ సాఫీగా సాగట్లేదు. ఆ మూవీ పూర్తి చేశాక చేస్తాడో దాని మధ్యలో వదిలిపెట్టి చిరు సినిమా చేస్తాడో చూడాలి. శంకర్ తో చిరు సినిమాను అరవింద్ భారీ బడ్జెట్ తోనే చేయాలని చూస్తున్నారట.

Share.