మెగాస్టార్ చిరంజీవి కి కొరటాల శివ కు నడుమ రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్‌కు కయ్యంబెట్టాడా…? మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో 152వ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ తరుణంలో ఇద్దరి నడుమ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కయ్యంబెట్టి కూసుండట. ఇద్దరి నడుమ దేవిశ్రీ పంచాయితీకి కారణమేంటని ఆరా తీస్తే 152వ చిత్రమే కారణమట.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని సినిమానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. చిరంజీవికి సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసుకున్నట్లు సైరా యూనిట్ ప్రకటించింది. ఇప్పుడు ఇక చిరంజీవికి మిగిలింది సైరా ప్రమోషన్ కార్యక్రమాలు. చిరంజీవి సంబంధించిన చిత్ర కార్యక్రమాలు పూర్తి అయిన నేపథ్యంలో మరో కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేసేపనిలో చిరంజీవి ఉన్నాడు.
కొరటాల శివతో చిరంజీవి తదుపరి చిత్రం ఉంటుందని ప్రకటించారు. అయితే చిరంజీవికి కొరటాల శివకు సంగీత దర్శకుడి ఎంపికలో మనస్పర్థలు వస్తున్నట్లు సమాచారం. కొరటాల శివకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా తీసుకోవాలని ఉందట. కాని మెగాస్టార్‌కు మాత్రం చిరంజీవితో సైరా చిత్రానికి సంగీతం అందిస్తున్న బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదిని తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇద్దరు చెరో సంగీత దర్శకుడు పేరును చెపుతుండటంతో సమస్య వచ్చిందట. చిరంజీవితో దేవిశ్రీ గతంలోనే శంకర్‌దాదా ఎంబీబీఎస్, ఖైదీ నంబర్ 150 చిత్రాలకు పని చేశాడు. కొరటాలకు దేవిశ్రీకి మిర్చి సినిమా నుంచి భరత్ అనే నేను వరకు కాంబినేషన్‌గా వస్తున్నారు. సో ఇప్పుడు ఇద్దరి నడుమ దేవిశ్రీ గొడవకు కారణమయ్యాడట. మరి ఏమైతుందోననే ఆందోళనలో ఇద్దరి అభిమానులు ఉన్నారు.