‘సైరా’ కోసం చిరు ఏంచేస్తున్నారో తెలుసా?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ కి పదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా అనున్నదానికన్నా ఎక్కువే విజయం సాధించింది. ఈ మూవీలో ద్విపాత్రాభినయంలో నటించి మెప్పించిన చిరంజీవి తన పవర్ ఏంటో చూపించాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెలుగు పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహాడ్డి జీవి కథ ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’మూవీ లో చిరంజీవి నటిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ పనులు పూర్తయ్యాయి. తన పాత్రైన ‘సైరా’కు చిరు డబ్బింగ్ చెప్పడం ఒకటే బ్యాలెన్స్…ఇందుకోసం ఆయన ఏకంగా స్టూడియోనే తన ఇంటికి తెప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఈక్విప్‌మెంట్ మొత్తాన్ని తెప్పించుకున్నట్లు సమాచారం. యన డబ్బింగ్ చెప్పేస్తే.. మిగతా పాత్రలకు డబ్బింగ్ కార్యక్రమాలు కూడా త్వరగా చెప్పించే పనిలో ఉన్నారట.

అంతే కాదు త్వరగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పనులు చేసి, సమయానికి సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. రామ్‌చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు.

Share.