టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ డాన్సర్ శివశంకర్ మాస్టర్ కరోనా మహమ్మారి తో పోరాడి తాజాగా తుదిశ్వాస విడిచారు. శివ శంకర్ మాస్టర్ మరణవార్తతో సినీ ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మరణవార్తతో సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. తాజాగా శివ శంకర్ మాస్టర్ మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. శివ శంకర్ మాస్టర్ మరణం నన్ను కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవైపు వ్యక్తిగతంగా, మరొకవైపు వృత్తిపరంగా ఎన్నో సవాళ్లను అధిగమించి వందల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా సేవలు అందించారని కొనియాడారు. అంతేకాకుండా శివ శంకర్ మాస్టర్ తాను కలిసి ఎన్నో సినిమాల్లో పని చేశాము అని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఖైదీ సినిమాకు సలీమ్ మాస్టర్ అసిస్టెంట్ గా నాకు చాలా స్టెప్స్ ఆయన కంపోజ్ చేశారని ఆ సమయంలో మొదలైన నా స్నేహం చాలా బలపడింది అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఆయనను ఆచార్య సెట్స్ లో కలిశాను, అదే చివరిసారి అవుతుందని అస్సలు ఊహించలేదు ఒక ఆత్మీయుడిని కోల్పోయినట్టే అనిపిస్తోంది అని సానుభూతిని తెలిపారు చిరంజీవి.