పవన్ కి మెగా స్టార్ సవాల్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ రోజు ఉదయం మన మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించారు, అందులో భాగంగా తన ఇంటి పెరట్లో మూడు మొక్కలని కూడా నాటారు చిరంజీవి. కొద్దీ రోజుల క్రితం మొదలైన ఈ హరిత హరమ్ ఛాలెంజ్ ని తెలంగాణ
ఐ టి శాఖ మంత్రి శ్రీ కె టి ఆర్ మొదలు పెట్టి క్రికెటర్ సచిన్ ని నామినేట్ చేసిన విషయం తెలిసిందే దానికి బదులుగా సచిన్ కూడా స్పందించి మూడు మొక్కలు నాటారు. ఇక ఈ రోజు చిరంజీవి యాన్ టి వి అధినేత శ్రీ నరేంద్రనాథ్ చౌదరి గారు ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటారు.

అటు తర్వాత చిరంజీవి మరో ముగ్గురు ప్రముఖుల్ని కూడా నామినేట్ చేసారు వారే ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ఈనాడు సంస్థల అధినేత శ్రీ రామోజీ రావు గారు మరియు తన సోదరుడు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్.

Share.