మెగా ఫ్యామిలీ అనగానే అందరికీ టక్కున గుర్తుకొచ్చే పేరు చిరంజీవి అని చెప్పవచ్చు. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ ఆ తర్వాతే నాగబాబు అని చెబుతూ ఉంటారు మొదటి నుంచి ఎందుకో గాని మెగా కుటుంబంలో నాగబాబు పేరు తక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా పవన్ కళ్యాణ్, చిరంజీవి పేరే వినిపించేలా ఉంటుంది. అంత పెద్ద స్టార్ హీరో కాలేకపోయినా నాగబాబు నటనలో టాలెంట్ ఉన్న.. సక్సెస్ కాలేకపోయారు. కానీ పలు చిత్రాలలో కీలకమైన పాత్రలు నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటున్నారు నాగబాబు. రీసెంట్గా నాగబాబు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
సంతోష్ శోభన్ ,గౌరీ జి కిషన్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం శ్రీదేవి, శోభన్ బాబు. ఈ చిత్రాన్ని ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సుస్మిత కొణిదెల విష్ణు ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ఈ రోజున గ్రాండ్ గా విడుదల కాబోతోంది ఈ క్రమంలోనే నాగబాబు మాట్లాడుతూ మా ఇంట్లో ఎంతో మంది హీరోలు ఉన్నారు నాకు ఎవరు కూడా ఎప్పుడు ఎలాంటి అవకాశం ఇవ్వలేదని తెలియజేశారు.
కానీ సుస్మిత మాత్రం తనకు పిలిచి ఆఫర్ ఇచ్చిందని సుస్మిత బంగారం అంటూ ఒక రేంజ్ లో పొగిడేశారు. అంతేకాకుండా ఆమె తీస్తున్న మరొక వెబ్ సిరీస్ లో కూడా తనకు ఆఫర్ ఇచ్చారని తెలిపారు నాగబాబు. దీంతో కొంతమంది మెగా హీటర్స్ కావాలని నాగబాబు కామెంట్స్ ని వైరల్ చేస్తున్నారని తెలియజేస్తున్నారు. మరికొంతమంది నీ ఫేస్ కి అంత సీను లేదు నీకు ఆఫర్ ఇచ్చింది ఎక్కువ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.