మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు ఈ విషయం గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంది.. నాగబాబు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. టైర్ -2 హీరోలలో తనకంటూ ఒక మంచి స్థానాన్ని సంపాదించారు వరుణ్ తేజ్.. ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో నిశ్చితార్థం ఈనెల 9 వ తేదీన హైదరాబాద్లో జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నిశ్చితార్థ వేడుకలకు కుటుంబ సభ్యులు మరి కొంతమంది అతిధులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం.
ఈ ఏడాది చివరిలో వీరి పెళ్లి జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విదేశీ పర్యటనలు వీరిద్దరూ ఉన్నట్లుగా తెలుస్తోంది. జూన్ 1వ తేదీన హైదరాబాద్ కి చేరుకోబోతున్నారని ఆ తర్వాత వీరిద్దరికీ నిశ్చితార్థం పై మెగా ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ మీడియా పింక్ విల్లా కథనం ప్రకారం జూన్ 9వ తేదీన లావణ్య వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరగబోతుందని ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని వధువు వరుల దుస్తులు ఆభరణాలు ప్రముఖ డిజైనర్ రూపొందించబోతున్నట్లు సమాచారం.
లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ జంటగా మిస్టర్ సినిమాలో నటించారు డైరెక్టర్ శీను వైట్ల ఈ సినిమాని తెరకెక్కించగా ఫ్లాప్ గా మిగిలింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పలు రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. కొన్ని సందర్భాలలో లావణ్య త్రిపాఠి ఈ విషయాన్ని ఖండించడం జరిగింది.ప్రస్తుతం లావణ్య త్రిపాఠి కెరియర్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్టు కూడా లేదు ఇటీవల ఈమెయిల్ నటించిన వెబ్ సిరీస్ పులిమేక విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
ఇక వరుణ్ తేజ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో గాండీవ దారి అర్జున చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా యాక్సిన్ చిత్రంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.