చిరంజీవి కూతురిగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కాస్ట్యూమ్ డిజైనర్ గా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది సుస్మిత. ఈమే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది. ఇక ఈ నిర్మాణ సంస్థ మీదే సినిమాలు తీయాలని చాలా ఆత్రుతగా ఉన్నది. అందుకోసం ఇప్పుడు ఒక డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా అ సుస్మిత ఒక లేడి ఓరియెంటెడ్ సినిమాలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో నటించేందుకు కృతి శెట్టి కూడా ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏ నిర్మాత అయినా ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాలు తెరకెక్కించాలని అంటే.. ఆ హీరోయిన్ యొక్క కొత్త సినిమాలు నటన పరంగా తీసుకుంటూ ఉంటారు. కానీ నీ కృతి శెట్టి పై ఎంతో నమ్మకంతో సుస్మిత ఈ అవకాశం ఇవ్వడం చాలా డేరింగ్ విషయమని అభిప్రాయపడుతున్నారు నెటిజన్స్. రాజ్ తరుణ్ తో ఉయ్యాల జంపాల, నాని తో మజ్ను సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ విరించి వర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా సక్సెస్ కావాలని మనం కూడా కోరుకుందాం.