వెంకటేష్ నారప్ప సినిమా తో కాస్త సక్సెస్ అందుకున్నప్పటికీ.. దృశ్యం 2 సినిమా తో వెంకటేష్ కొత్త ఉత్సాహం చెందారని చెప్పవచ్చు. ఇక అదే ఉత్సాహంతో.. తన నెక్ట్స్ ప్రాజెక్టు కూడా సిద్ధమయ్యాడు వెంకటేష్. ప్రస్తుతం ఈ హీరో చేతిలో 2,3 కథలు ఉన్నట్లు సమాచారం. ఇక ఈ కథలో నలుగుతున్నటువంటి కథ తరుణ్ భాస్కర్ ప్రాజెక్టు కూడా ఉన్నది. అయితే ఈ స్టోరీని సెట్స్ పైకి తీసుకురావడానికి.. వెంకీ ఇష్టపడడం లేదు.
అయితే ఈ గ్యాప్ లో వెంకటేష్ ఒక సినిమా చేయడానికి చాలా ఆత్రుతతో ఉన్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే వెంకటేశ సినిమాలో నటించేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి. మలయాళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న డ్రైవింగ్ లైసెన్స్ సినిమాలో వెంకటేష్ నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో వెంకటేష్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పాత్ర చేస్తున్నట్లుగా సమాచారం.
అయితే ఇలాంటి పాత్రలకు వెంకటేష్ సూట్ అవుతాడు అని చర్చ టాలీవుడ్ లో జరిగింది. అదే పాత్రను వెంకటేష్ పోషించే అవకాశం ఉన్నట్లుగా సమచారం. కానీ ఈ సినిమా రైట్స్ ని మొత్తం మెగా ఫ్యామిలీ దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. ఆచార్య సినిమా పూర్తి అయిన తర్వాత వెంకటేష్ చేయబోయే ప్రాజెక్ట్ పై మెగా కాంపౌండ్ ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నది. ఇక ఈ సినిమా హక్కులన్నీ రామ్ చరణ్ దక్కించుకున్నారు. అందుచేతనే ఈ సినిమా కోసమే వెంకటేష్ వెయిట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.