Meerajasmine..టాలీవుడ్ లో హీరోయిన్ మీరాజాస్మిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందింది మీరాజాస్మిన్(Meerajasmine).. ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలని లగ్జరీ లైఫ్ జీవించాలని కలలు కంటూ ఉండేది.. అతి సాధారణ కుటుంబంలో పుట్టిన ఈమె తన కలలను సహకారం చేసుకోవడానికి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అలా మలయాళ సినిమాలలో మొదటిసారిగా నటించడానికి ఆమెకు అవకాశం లభించింది.ఆ తర్వాత నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్టుగా నిలిచాయి.
అలా తమిళ్ ,మలయాళం తెలుగు వంటి సినిమాలలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. సినిమాలలో ఈమె జాతీయ అవార్డును సైతం అందుకుంది.అంతకుమించి వివాదాలను కూడా ఎదుర్కొంది మీరా జాస్మిన్. మరియు ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ కూడా అవ్వడం జరిగింది. సినిమాలలో నటిస్తున్న కాలంలోనే మాండోలిస్ రాజేష్ అనే సంగీత విధ్వంసుడితో ఈమె ప్రేమాయణం కొనసాగించిందట. దాదాపుగా వీరి ప్రేమ బంధం ఎనిమిదేళ్లపాటు కొనసాగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కొన్ని వార్త పత్రికలలో అయితే ఏకంగా సహజీవనం చేశారని వార్తలు వినిపించాయి.
ఈ విషయాన్ని మీరాజాస్మిన్ ఒక ఇంటర్వ్యూలో అడగగా ఆమె ఒప్పుకున్నట్లు సమాచారం. మరో రెండే మూడేళ్ల తర్వాత వివాహం చేసుకుంటామని ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉన్నానని తెలియజేసింది.. కానీ వారి బంధానికి ఓవర్ నైట్ కే పుల్ స్టాప్ పెట్టి అమెరికా నుంచి వచ్చిన (అనిల్ జాన్) ను కోటీశ్వరుడుతో ఈమె వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యింది.. అది కూడా రెండవ పెళ్లి అన్నట్లుగా సమాచారం. వీరి పెళ్లిలో కూడా చాలా రభస జరిగినట్లు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా ఒక క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిన ఈమె కేరళలోని ఒక గుడిలో హిందువులకు మాత్రమే అనుమతి ఉంటే గుడిలోకి ప్రవేశించానంటు స్టేట్మెంట్ ఇచ్చి పదివేల రూపాయలు జరిమానా కూడా కట్టింది. ఇప్పుడు తన భర్త నుంచి విడాకులు తీసుకొని దూరంగా ఉంటోంది.