Meena.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన అలనాటి అందాల తారల మీద ఎన్నో సినిమాలలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది మీన (Meena). ముఖ్యంగా స్టార్ హీరోలు అందరి సరసన కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ.. జపాన్లో కూడా భారీ పాపులారిటీని దక్కించుకుంది. ఇకపోతే ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ దక్కించుకున్న మీనా గతంలో కంటే ఇప్పుడు భారీ స్థాయిలో బిజీగా మారిపోయింది. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.
ఈమె భర్త అతి చిన్న వయసులోనే మరణించడంతో డిప్రెషన్ లోకి వెళ్లిన మీనా ఇప్పుడిప్పుడే ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి తన కూతురు భవిష్యత్తు కోసం సినిమాలలో మరింత బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. భర్త మరణించిన తర్వాత ఇలా రెమ్యునరేషన్ పెంచేసి నిర్మాతలకు సైతం షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తన కూతురు భవిష్యత్తు కోసం కూడా ఆలోచించిన మీనా డిమాండ్ మేరకే రెమ్యునరేషన్ అడుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రూ.20 లక్షల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అనవసరమైన గెస్ట్ పాత్రలు చేయకుండా ప్రాధాన్యత ఉంటేనే చేయాలని కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
. సౌత్ ఇండస్ట్రీలో దాదాపు అన్ని భాషల్లో కూడా సినిమాలు చేసింది. సినిమా జీవితానికి సంబంధించి ఏ రోజు కూడా విమర్శలు ఎదుర్కోని మీన (Meena). ఈ మధ్యకాలంలో వైవాహిక జీవితంలో పలు విమర్శలు ఎదుర్కొంది. రెండో పెళ్లి చేసుకోబోతోందని కొన్ని అబద్ధపు ప్రచారాలు కూడా వచ్చాయి. కానీ అవి నిజం కాదని ఆమె తెలిపింది. ఇకపోతే ఆర్థికంగా కూడా బాగుండాలని అందుకు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.