పెళ్లి చేసుకున్న నరేష్ – పవిత్ర.. వీడియో వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎట్టకేలకు నరేష్ , పవిత్ర లోకేష్ ఈరోజు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని నరేష్ తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో ఈ వీడియోని షేర్ చేస్తూ తాము వివాహం చేసుకున్నాము అంటూ ప్రకటించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో షేర్ చేయగా సర్వత్ర ఆ వీడియో చాలా వైరల్ గా మారుతుంది. ఈ ఏడాది వారిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అంటూ లిప్ కిస్ తో కూడిన ఒక వీడియోను షేర్ చేసినప్పుడు పెద్ద ఎత్తున సంచలనం రేకెత్తించి. అయితే అదే సమయంలో రంగంలోకి దిగిన ఆయన మూడవ భార్య రమ్య రఘుపతి తనకు విడాకులు ఇవ్వకుండా ఎలా వివాహం చేసుకుంటారు అంటూ పెద్ద ఎత్తున మీడియా ముందు రచ్చ చేసింది.

Actor Naresh Pavitra Lokesh Got Married Naresh Shared Video Says Seeking  Your Blessings For Life Time | Naresh Pavitra Lokesh Marriage: పెళ్లి  చేసుకున్న నరేష్, పవిత్ర లోకేష్ - వీడియో వదిలిన కొత్త జంట

అంతేకాదు ఈరోజు ఉదయం కూడా ఆమె మరొకసారి తన భర్త తనకు విడాకులు ఇవ్వకుండా నాలుగవ వివాహం ఎలా చేసుకుంటాడు అంటూ కూడా నిలదీసింది . అయితే ఏమైందో తెలియదు కానీ నరేష్ మాత్రం ఈరోజు పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకొని అందుకు సంబంధించిన వీడియోను డైరెక్ట్ గా సోషల్ మీడియాలో షేర్ చేశారు . అయితే ఈ విషయం తెలిసి కొంతమంది ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతుంటే మరి కొంత మంది అనుకున్నది నెరవేర్చుకున్నావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే ఈ జంట మూడుముళ్లతో ఏడు అడుగులతో ఒకటి అవడంతో మిశ్రమంగా కామెంట్లు వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం. పవిత్ర లోకేష్ ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరొకవైపు తనపై వస్తున్న రూమర్లకు గట్టిగా స్పందిస్తూ వచ్చింది అయితే ఇప్పటివరకు రమ్య రఘుపతి ఆరోపణలను తిప్పి కొట్టే ప్రయత్నం చేసింది. గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటూ ఈరోజు నరేష్ను వివాహం చేసుకుంది. ఏదైతేనేం నాలుగవసారి వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టేశారు నరేష్.

Share.