హీరో అక్షయ్ కుమార్, పరేశ్ రావల్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం ఓ మై గాడ్.. ఈ సినిమా హిందీలో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాని తెలుగులో గోపాల గోపాలలో వెంకటేష్-పవన్ కళ్యాణ్ రీమిక్స్ చేశారు. ఈ సినిమాలో దేవుడు గా పవన్ కళ్యాణ్ నటించారు. అయితే ఈ సినిమా కూడా తెలుగులో మంచి సక్సెస్ను అందుకుంది. అంతే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా పొందింది ఈ సినిమా.
ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా హిందీలో ఓ మై గాడ్ -2 కి సన్నహాలు చేస్తున్నారు అన్నట్లుగా సమాచారం. అయితే ఈసారి అక్షయ్ కుమార్ ఇందులో శివుడి పాత్రలో కనిపించబోతున్నాడు అనే విధంగా తెలుస్తోంది. మరి ఈ సినిమాని కూడా తెలుగులో రీమేక్ చేస్తారా లేదా అనే విషయం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీ గానే ఉన్నారు. ఇక అంతే కాకుండా వెంకటేష్ కూడా మల్టీస్టారర్ మూవీలో వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ సినిమానే చేస్తారా లేదా అనే విషయం తెలియడం లేదు.