మహేష్ బాబు ప్రస్తుతం సర్కార్ గారి పాట సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. జనవరి నెల నుంచి రాబోయే మూడు నెలల పాటు రెస్ట్ తీసుకో పోతున్నాడని సమాచారం. దానికి ప్రధాన కారణం ఈ సినిమా షూటింగ్లో మహేష్‌బాబు మోకాలికి గాయం అవ్వడమే అని తెలుస్తోంది. సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావస్తోంది.
అలా షూటింగ్ పూర్తయిన వెంటనే విదేశాలకు వెళ్లి తన మోకాలికి సర్జరీ చేయించుకోవాలని మహేష్ బాబు అనుకుంటున్నట్లుగా సమాచారం. 2014 నుండి మహేష్ బాబుకు మోకాలు సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 2017 స్పైడర్ టైం కి దాని తీవ్రత ఎక్కువగా పెరగడంతో వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోలేదు. కానీ గత ఏడాది ఒకసారి కాల్ కి సర్జరీ చేయించుకున్నారు. దాంతో కొద్ది రోజులు పాటు రెస్ట్ తీసుకోమని వైద్యులు తెలియజేశారు. కానీ ఇప్పుడు మరొకసారి మోకాలికి సర్జరీ చేయించుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి నిజమో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.