మరొక కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిన నయనతార..!

Google+ Pinterest LinkedIn Tumblr +

లేడీ సూపర్ స్టార్ నయనతార వెంకటేష్ తో కలిసి లక్ష్మి సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటించింది. ప్రస్తుత తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా నటిస్తున్నది. ఇక ఎక్కువగా ఈ మధ్యకాలంలో లేడి ఓరియెంటెడ్ సినిమాల వైపే మొగ్గు చూపుతోంది. ఇక ఇలాంటి సినిమాలతోనే తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఆమె మరొక బిజినెస్ లోకి అడుగు పెట్టిందని తెలుస్తోంది.బ్యూటీ ప్రోడక్ట్ కు సంబంధించిన బిజినెస్ ను ప్రారంభించిన అన్నట్లుగా తెలుస్తోంది. ది లిప్ బామ్ అనే కంపెనీ పేరుతో రిటైల్ బ్రాండ్ ను విడుదల చేసింది. చర్మవ్యాధి నిపుణురాలు అయిన రాజన్ తో కలిసి ఈ బిజినెస్ ను ప్రారంభించింది.

నయనతార నాలుగు భాషల్లో నటిస్తూ బాగా బిజీ గా ఉన్నది. ఎన్నో సంవత్సరాల తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాలో కథానాయికగా నటించింది. ఇక తన రెమ్యూనరేషన్ విషయంలో కూడా స్టార్ హీరోలకు తగ్గట్టుగానే తీసుకుంటోంది. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ తో కలిసి కొన్ని సినిమాలలో నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.

Share.