టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో క్రేజ్ సంపాదించుకున్న వారిలో ఈమె కూడా ఒకరు. మొదట నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది.ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది.అదేవిధంగా ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలలో కీర్తి సురేష్ వెరైటీ చీరకట్టులో కనిపించి ఆకట్టుకుంది.ఈ ఫోటోలు సోషల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కీర్తిసురేష్ సినిమాల విషయానికొస్తే.. చేతినిండా బోలెడు సినిమాలతో దూసుకుపోతోంది.కీర్తి నటించిన మలయాళ చిత్రం ‘మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ’.నేడు(డిసెంబర్2)న రిలీజైన సంగతి తెలిసిందే.