ఒక వీడియోతో అన్నకి షాక్ ఇచ్చిన మనోజ్.. ఇప్పుడు మరో వీడియోతో రచ్చ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మొన్నటికి మొన్న మంచు మనోజ్ తన అన్న మంచు విష్ణు తన అనుచరులపై కొట్టడానికి వస్తున్నాడు అంటూ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మంచు ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే దీనిమీద రకరకాల కథనాలు కూడా వెలువడ్డాయి. ఇక ఆ సంగతి పక్కన పెడితే ఆ తర్వాత ఇదంతా కూడా ఒక ఫ్రాంక్ అంటూ విష్ణు షేర్ చేసిన వీడియోతో మళ్ళీ వైరల్ అయింది. ఆ తర్వాత ఆ వీడియో వైరల్ అయ్యేలోపే మంచు లక్ష్మి మీడియాతో మేము ఎటువంటి రియాల్టీ షో చేయలేదు అంటూ కుండబద్దలు కొట్టింది.

Special video of Manoj with new wife కొత్త భార్యతో మనోజ్ స్పెషల్ వీడియో

ఎవరిని నమ్మాలో తెలియక అందరూ సతమతమయ్యారు. ఇకపోతే ఇప్పుడు ఈ వివాదం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉండడంతో దాన్ని పక్కదారి పట్టించాలని ఇలా ఒక ప్రోగ్రాం అనౌన్స్ చేశారనే ప్రచారం కూడా జరిగింది. కానీ అసలు విషయం ఏంటి అనేది మంచి కుటుంబ సభ్యులే వివరణ ఇవ్వాలి.. ఇకపోతే ఒక చిన్న వీడియో రిలీజ్ చేసి పెద్ద రచ్చకు కారణమైన మంచు మనోజ్ ఇప్పుడు మరొక వీడియో షేర్ చేశాడు. అయితే ఇది రచ్చ రేపే వీడియో కాదు కానీ తన ప్రేమను బయటపెట్టే వీడియో అని చెప్పవచ్చు.

నేటితో మంచు మనోజ్, మౌనికల వివాహం చేసుకొని సరిగ్గా నెల రోజులు పూర్తయ్యాయి. మార్చి మూడవ తేదీన భూమా మౌనిక మెడలో మూడు ముళ్ళు వేసి ఏడు అడుగులు నడిచాడు మనోజ్ . ఈ నేపథ్యంలోని ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. “ప్రేమించు.. ప్రేమను పంచు.. ప్రేమగా జీవించు” అంటూ ఒక క్యాప్షన్ పెట్టి తన భార్య మౌనికపై ఉన్న ప్రేమను ఈ విధంగా తెలియజేశారు మనోజ్. ఇక నూతన దంపతులకు ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Share.