టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ పేరు తెచ్చుకున్న హీరో మోహన్ బాబు. ఈయన తనయుడు ఈ మధ్యకాలంలో భూమా మౌనిక ను రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే .. పెళ్లి జరిగిన తరువాత మనోజ్ పేరు పాపులర్ అవుతుంది.. అంతేకాకుండా మనోజ్ రాజకీయాలకు రాబోతున్నారని సంచలనాలని క్రియేట్ చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు వైరల్ మారుతున్నాయి. కానీ మనోజ్ రాజకీయాల్లోకి వచ్చి ఉద్దేశం లేదంటు క్లారిటీ ఇవ్వడం జరిగింది.
మోహన్ బాబు బర్తడే సందర్భంగా మంచు మనోజ్ గురించి మాట్లాడుతూ.. చాలా ఎమోషనల్ అయ్యారు. తిరుపతిలోని మోహన్ బాబు కళాశాలలో జన్మదిన వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్, భూమా మౌనిక ఇద్దరు మోహన్ బాబు బర్త్‌డేకి హాజరవ్వడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది. ఈ సందర్భంలోనే కొన్ని విషయాలను నాన్న గురించి మంచు మనోజ్ స్టేజ్ పై ప్రసంగించాడు.
మనోజ్ స్టేజ్ పై మాట్లాడే మాటలు తన తండ్రిని, భార్యని ఎమోషనల్ కి గురిచేసాయి. నేను ఇప్పటికే మా నాన్నని ఎంతో ఇబ్బంది పెట్టానని ఆయన నాకు అన్నీ ఇచ్చారు కానీ ఆయన రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. మనోజ్ భార్య మౌనిక గురించి మాట్లాడుతూ నేను ప్రేమించిన అమ్మాయి స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నా తన డ్రీమ్స్ కి ఎప్పుడు అడ్డుపడనని అలాగే తనకి అన్ని విధాల హెల్ప్ ఫుల్ గా ఉంటానని అలాగే ప్రతి మగాడి విజయం వెనక ఆడవాళ్లు ఉంటారు.
అన్నది ఎంత నిజమో ప్రతి అమ్మాయి వెనక మగాడి విజయం కూడా ఉంటుంది. అది నేను కూడా ఫాలో అవుతాను అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. మంచు మనోజ్ మాటలు భూమా మౌనిక ఆనందంతో కంటతడి పెట్టుకుంది. ఇక చూస్తుంటే త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చి తన సత్తా చాటుతాడేమో చూడాలి మరి.