టాలీవుడ్ లో మంచు మోహన్ బాబు కి ఎంత ఈ క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. ఒకప్పుడు మోహన్ బాబు విలన్ గా నటించారు ఆ తర్వాత హీరోగా పలు సినిమాల్లో నటించారు. ఆయన మాటలు వినటానికి కఠినంగా ఉన్న కాని మంచి మనసు ఉన్న వ్యక్తి మోహన్ బాబు. ఇక మోహన్ బాబు కి ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె అయితే మంచు మనోజ్ ఆల్రెడీ పెళ్లయిన విషయం తెలిసిందే .ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఆమె ఎవరో కాదు. రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె మౌనిక రెడ్డితో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మనోజ్ రెండో పెళ్లి జరగనుందని తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే వినాయక చవితి పండగ సందర్భంగా వీరిద్దరూ కలిసి వినాయకుడి మండపం లో ప్రత్యేక పూజలు చేయడంతో వీరి గురించి ఒక్కసారిగా వార్తలు వైరల్ గా మారాయి.అప్పటినుంచి వీరి వివాహం గురించి ఏదో ఒక వార్త వినపడుతూనే ఉంది. అయితే మార్చి 3వ తేదీ మనోజ్, మౌనికల వివాహం జరగబోతుందని ఇప్పటికే వీరి వివాహానికి సంబంధించి పెళ్లి పనులు కూడా జరుగుతున్నాయని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మాత్రమే వీరి వివాహం జరగబోతుందని తెలియజేశారు.
మనోజ్ ,భూమా మౌనికకు ఉన్నటువంటి రిలేషన్ గురించి మొదటిసారి స్పందించారు మనోజ్ ..మొదట మా ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉండేదని అయితే అది కాస్త ప్రేమగా మారిందని అంతేకాకుండా కష్ట సమయాల్లో తనకు భూమా, మౌనిక ఎంతో అండగా నిలిచారని నా జీవితంలోకి ఈ అమ్మాయి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని మనోజ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.